Header Banner

హైకోర్టు తిరస్కరణతో సుప్రీంకోర్టుకు చేరిన సుకుమారుడు! మరి అక్కడ ఏం జరుగుతుందో..

  Sat Apr 26, 2025 16:11        Politics

ఏపీలో వైసీపీ సానుభూతిపరుడు, ఆ పార్టీ అధికారంలో ఉండగా కూటమి పార్టీల నేతలపై తీవ్ర స్ధాయిలో రెచ్చిపోయిన బోరుగడ్డ అనిల్ కుమార్ కు ఇప్పుడు వరుస ఎదురుదెబ్బలు తప్పడం లేదు. గతంలో తన తల్లికి అనారోగ్యం పేరుతో బెయిల్ తీసుకున్న బోరుగడ్డ అనిల్ కుమార్ దాని పొడిగింపు కోసం కోర్టుకు సమర్పించిన సర్ఠిఫికెట్ అంటూ పోలీసులు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఆయన పెట్టుకున్న కొత్త బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టు ఎటూ తేల్చడం లేదు. దీనిపై బోరుగడ్డ సుప్రీంను ఆశ్రయించారు.



తన బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపేలా ఏపీ హైకోర్టుకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ బోరుగడ్డ అనిల్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ జరిపింది. అయితే ఈ వ్యవహారంలో హైకోర్టుకు ఆదేశాలు ఇవ్వలేమని సుప్రీంకోర్టు బోరుగడ్డకు తేల్చిచెప్పేసింది. నకిలీ మెడికల్ సర్టిఫికెట్ పెట్టి బెయిల్ పొడిగించుకున్న వ్యవహారం తేలే వరకూ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపేలా ఆదేశాలు ఇవ్వలేమని సుప్రీంకోర్టు తెలిపింది. దీంతో బోరుగడ్డకు షాక్ తప్పలేదు.



ఇది కూడా చదవండి: మరో పదవిని కైవసం చేసుకున్న కూటమి ప్రభుత్వం! 74 మంది మద్దతుతో.. 

 

బోరుగడ్డ అనిల్ సమర్పించిన నకిలీ ధృవపత్రాల ఆధారంగా బెయిల్ ఇచ్చారా లేదా అన్న విషయం తేలకుండా రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపితే ఆ ప్రభావం దీని మీద పడుతుందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కేవీ విశ్వనాథన్ తెలిపారు. అందుకే ఆ ధృవపత్రాలపై హైకోర్టు నివేదిక కోరినట్లు వెల్లడించారు. అయితే చివరిగా బోరుగడ్డ బెయిల్ పిటిషన్ పై సాధ్యమైనంత త్వరగా విచారణ జరిపి నిర్ణయం ప్రకటించాలని మాత్రం మరో జడ్జి జస్టిస్ నాగరత్న ఏపీ హైకోర్టును ఆదేశించారు. దీంతో త్వరలో బోరుగడ్డ బెయిల్ వ్యవహారంపై ఏపీ హైకోర్టు నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.


ఇది కూడా చదవండి: మీరు నీళ్లు ఆపేస్తే మేము మీ ఊపిరి ఆపేస్తాం! వైరల్ అవుతున్న వీడియో!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైసీపీ బాగోతం! అధికారంలో బెదిరింపులు.. బయటపడ్డాక బెయిల్ పిటీషన్లు!

 

 

ఏపీలోని కూటమి ప్ర‌భుత్వానికి కేంద్ర గుడ్‌న్యూస్.. ఆ నిధుల‌ విడుద‌ల!

 

వీరయ్య చౌదరి హత్య కేసులో కీలక ఆధారాలు! స్కూటీ స్వాధీనం! వారిద్దరు నిందితులుగా గుర్తింపు!

 

అర్ధరాత్రి భారత జవాన్లపై పాక్ కాల్పులు! కాశ్మీర్ ఎల్ఓసీ పొడవునా..

 

ఢిల్లీలో జరిగిన గంటల చర్చలు.. కీలక నిర్ణయాలు ! వాటికి ఓకే చెప్పిన మోదీ!

 

మరో నామినేటెడ్ పోస్ట్ లిస్ట్ రెడీ! కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఎప్పుడంటే?

 

సీఎంలకు హోం మంత్రి అమిత్ షా ఫొన్.. 48 గంటల లోపు.. ఎందుకంటే.!

 

మహిళలకు ప్రభుత్వం శుభవార్త.. 2-3 రోజుల్లో అకౌంట్లలోకి డబ్బులు.! వారికి ఇక పండగే పండగ..

 

సస్పెండ్ విషయంలో దువ్వాడ కీలక వ్యాఖ్యలు! తాను ఎప్పుడూ పార్టీకి..

 

మరోసారి బరితెగించిన వైసీపీ మూకలు..! ఏం చేశారంటే..!

 

వైసీపీ గుట్టు రట్టు! సెక్షన్లకే షాక్ ఇస్తున్న సునీల్ కుమార్ కేసులు!

 

ఏపీ ప్రజలకు శుభవార్త! కొత్త పెన్షన్లకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 

 


   #AndhraPravasi #borugaddaanil #supremecourtshock #bailorder #breakingnews #legalupdate #courtverdict #andhrapolitics #politicalnews